అంశం:బలగం
శీర్శిక: *బలగం ఏ ప్రాణికైనా వెయ్యి ఏనుగుల బలం*
తరతరాలకు తరగనది
తరతరాల నుండి వచ్చుచున్నది
సమయం వచ్చినప్పుడు ఆదుకునేది
వెలకట్టలేనిది అమూల్యమైనది బలగం!
మంచి నీళ్ళు త్రాగినా త్రాగక పోయినా
పండ్లు ఫలాలు ఆహారం తిన్నా తినకున్నా
చుట్టూరా బంధువులు తోడుంటే
ఆ బలగం వెయ్యేనుగుల బలాన్ని ఇస్తుంది!
పూర్వ కాలంలో ఉమ్మడి కుటుంబాలుండేవి
ఏ కష్టం నష్టం వచ్చినా బాధ కలిగినా
ఇంటి పెద్ద ఒక్కరే చూసుకునే వారు
బలగం ఉంటే బలం కట్టెల మోపులా
దృఢంగాను గట్టిగానూ ఉండేది
బలగం ఏ ప్రాణికైనా వెయ్యి ఏనుగుల బలం!
నేడు న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడ్డాయి
ఒక కుటుంబం కూడా కలిసి ఉండటం
గగన కుసుమం గా మారుతుంది
బంధుత్వ బలగం లేక బలం తగ్గిపోతుంది!
దీనికి తోడు నేడు ప్రేమ వివాహాలనీ
స్వేచ్ఛ సహ జీవన వాధానాలనీ
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా
ఎడారి ఒంటెలుగా మారుతున్నారు
ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోడానికి
యువతీ యువకులు ఇష్ట పడటం లేదు
ఆదాయం వస్తుందని తల్లిదండ్రులు సహితం
కన్న పిల్లలకు సహకరిస్తున్నారు!
ఇక బలగం ఎలా ఏర్పడుతుంది?
మానసిక బలం ఎలా పెరుగుతుంది?
సమస్యలేర్పడుతే ఆత్మహత్యలే శరణ్యం!
No comments:
Post a Comment