శీర్షిక: ఉగ్ర వాదాన్ని తుదముట్టించాలి
యాత్రికులంతాకలిమిడి బయటఏదో అలజడి
అది పహల్గాం లోయ మినీ స్విట్జర్లాండ్
అమ్మా నాన్నా మరికొందరు బయటకెళ్ళారు
నేను తమ్ముడు ఒక అంకుల్ ఇక్కడే ఉన్నాం!
టప టప మంటూ ఏవో తుపాకీ పేలుళ్లు
కడలి కెరటాల వలె కడుపులేదో గుబులు
టేబుల్ కిందనక్కాం కళ్ళుచెవులుమూసుకుని
అప్పుడే ఒక కాశ్మీరీ చెప్పాడుబయపడకండనీ
నేడు కశ్మీరీ ఆనివర్సరీ డే అది మామూలేననీ!
నాలో ఏదో బయం అమ్మా నాన్న రాలేదనీ
ఇంతలో అమ్మ కనపడింది తలబాదుకుంటూ
నాన్న ఇక లేడని తెలిసిన కూతురు ఆవేదన!
అదొక పారాణి కూడా ఆరని నవయువజంట
కాశ్మీర్ దర్శించ వచ్చారు విహార యాత్ర కనీ
కళ్ళముందే భర్తను హిందూవా అని అడిగి
నిర్ధారించుకుని షూట్ చేసారు రక్త పిపాసులు
*నన్నుకూడా చంపండని యువతిదుఖిస్తుంటే*
*నిన్ను చంపం చెప్పుకోండి మోడి కంటూ*
కర్కశంగా బదులిచ్చిరి ఆ ఉగ్ర వాదులు!
ఎవరీ ఉగ్రవాదులు?ఎవరు వీరి వెనుక బలం?
ఎందుకు ఇలా హిందువులనే టార్గెట్ చేశారు?
ఈ రోజు హిందూమతం రేపు మరొక మతం
తక్షణమే ప్రపంచ దేశాలు ఏకమవ్వాలి
అణువణువు ఇంచుఇంచునా జల్లెడ పట్టాలి
ఉగ్రవాదుల ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
No comments:
Post a Comment