అంశం:మై సెల్ఫీ
శీర్షిక: నడక ఆయుష్షు పెంచుతుంది
బుల్లి బుల్లి నడకలతో బిడ్డ
కిలకిలా నవ్వుతూ అమ్మ కేసి చూస్తూ
తప్పటడుగులతో మెలికలు తిరుగుతూ
నాన్న చిటికెన వ్రేలు పట్టుకుని నడుస్తుంటే
అమ్మ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే
ఆ బిడ్డ కేమెరుక అది తన మొదటి అడుగని
ఆ బాబు కేమి తెలుసు నడక ప్రయోజనం!
బాల్యం కౌమారం యవ్వనం దాటాక
వృద్దాప్యంలో స్ఫురణకు వస్తుంది
ఏ యూట్యూబ్ చూస్తేనో
పది మంది మాట్లాడుకుంటుంటేనో
డాక్టర్ చెబితేనో ఆ నడక ప్రయోజనం!
ఏ సమయంలో ఆరంభించాల్సినది
ఆ సమయంలో ఆరంభిస్తేనే అందం చందం
ఆనందకర ఆరోగ్యం చక్కని ఆహార్యం
ఆరోగ్యమే మహాభాగ్యం!
అది లింగమయ్య కాలనీలో
సువిశాలమైన పార్క్
శుభోదయాన నిత్యం అరగంట నడక
చేస్తుంటాను
నడక కండరాలను గట్టి పరుస్తుంది
చాలా హాయినిస్తుంది
బరువును ఊభకాయం బిపిని తగ్గిస్తుంది
కొవ్వును కరిగిస్తుంది గుండెపోటు తగ్గిస్తుంది
మనో ధైర్యాన్ని ఉల్లాసాన్ని పెంచుతుంది
మనసులో ప్రశాంతత పెంచుతుంది
క్యాన్సర్ ను అదుపులో పెడుతుంది
ఆరోగ్యాన్నిస్తుంది ఆయుష్షు పెంచుతుంది!
ఇక నుండైనా ప్రతి రోజూ
పది వేల అడుగులు నడుద్దాం
పది మందికి నడక ప్రయోజనాలు చెబుదాం
ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం
నవ సమాజ నిర్మాణానికి తోడ్పడుదాం!
No comments:
Post a Comment