అంశం: చిత్ర కవిత
శీర్షిక: *విజ్ఞాన దాయిని*
బ్రహ్మ ఇల్లాలు సరస్వతీ మాత
హస్త భూషణాలయిన వీణ పుస్తకం
కమలం విశ్వ మానవాళికి
ఉల్లాసాన్ని ఇచ్చు ఉత్సాహాన్ని పెంచు
స్వాంతన చేకూర్చు ప్రశాంతత నిచ్చు
తన్మయత్వంలో ముంచు
సంగీత వీణ చతుష్షష్టి కళలలో ఒకటి!
పుస్తకం శారదాదేవి హస్త భూషణం
జ్ఞానాన్ని అందించేది విజ్ఞానాన్ని పంచేది
మేధస్సును పెంచేది ధైర్యాన్ని ఇచ్చేది
మనసును వికసింప జేసేది పుస్తకము
విజ్ఞానదాయిని కాత్యాయనికి ప్రీతియైనది!
గలగలా పారే గంగా గోదావరి కృష్ణా కావేరి
పుణ్య నదులకు పుట్టినిల్లు భారత దేశం
సేద తీర్చే ప్రశాంతత నిచ్చే నెమళిపింఛం
తిమిరాన్ని తొలగించే వెలుగు జ్యోతులతో
ఆధ్యాత్మికతలో అందే వేసిన పవిత్ర దేశం
వేదాలు పురాణాలు ఇతిహాస గ్రంధాలు
ఉపనిషత్తులు భగవద్గీత వంటి మరెన్నో
గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు
సంపదలకు నెలవైన దేశం
భారత దేశం వసుధ కెంతో ఇష్టమైనది!
No comments:
Post a Comment