Saturday, May 31, 2025

స్వాతి ముత్యంలా నీలో ఒదిగి పోనా

కవితార్చన :నేటి అంశం -ఆరాధన

శీర్షిక: *స్వాతి ముత్యంలా నీలో ఒదిగి పోనా*

*ఓ సుందరీ! ఓ నా ముగ్ధమనోహరీ!*
*నీ మది లోగిలిలో కొలువుండనా*
*నీ ఆరాధనలో సేదతీరనా*
*కలకాలం నీతో కలసి నడవనా!*

*పరవశాల ముచ్చట్లు నిత్యం వినిపించనా*
*తేనే లాంటి నీ కనులలో కరిగి పోనా*
*స్వాతి ముత్యంలా నీలో ఒదిగి పోనా*
*అదిరిన నీ ఎదలపై వాలిపోనా!*

*చెదిరిన నీ పైటను నా పైన కప్పుకోనా*
*నీ ప్రేమామృతాన్ని సర్రున జుర్రుకోనా*
*అలసి సొలసిన నీ సొగసులకు*
*వింజామరనైపోనా!*

*పట్టు పరుపులపై సేద తీరనా*
*వేణు గానమై నీ చెంత చేరి పోనా*
*ఆనంద రాగాలతో లతలా అల్లుకు పోనా*
*ఓ నా మమతల మల్లీశ్వరీ*
*నా మమతల కోవెల నీవే సుమా!*
 

No comments: