Sunday, May 11, 2025

అమర వీరుడు మురళీ నాయక్ కు అశృనివాళి

శీర్షిక: అమర వీరుడు మురళీ నాయక్ కు అశృనివాళి


జయహో మురళీ నాయక్ 

జయజయహో మురళీ నాయక్ 

వందనం అమరవీరుడా 

అభివందనం ఆదర్శ ధీరుడా

ఇరువది ఏడు మంది హిందువుల 

పరీక్షించి పరీక్షించి హతమార్చి 

సింధూ నదిలో రుధిరం పారించి 

కశ్మీరు మంచు కొండలను రక్తసిక్తం చేసి 

వారి మహిళల నుదుటి సింధూరం చెరిపేసిన 

మతోన్మాద ఉగ్రవాదులను మొక్కవోని ధైర్యంతో 

ప్రతిష్ఠాత్మకమైన *ఆపరేషన్ సింధూర్* లో

వేగుచుక్కలా వెంటాడుతూ వేటాడుతూ 

వీరమరణం పొందిన ఓ నవ యువ వీరుడా

ఆంద్రప్రదేశ్ గడ్డలో పుట్టిన ఓ భరతమాత బిడ్డా 

ఇవే నీకు మా ముకుళిత హస్తాలతో జోహార్లు!

నీ త్యాగం ఊరికే పోదు 

నీ రుధిరం తేరగ పోదు 

నీ ఆశయం వృధా కాదు 

అంతకు వందరెట్లు 

ప్రతీకారం తీర్చుకుంటుంది 

మన భారత సైన్యం

ఉగ్రవాదుల సంహారం తోనే 

నీ ఆత్మకు శాంతి చేకూర్చుతుంది 

మన భారత సైన్యం!


నీవు ఎంతోమంది సైనికులకు ఆదర్శం 

నిన్ను మరువదు భారత ప్రజానీకం 

నీ కీర్తి ప్రకాశించు జగతిన ఆచంద్రతారార్కం!


జయహో మురళీ నాయక్ 

జయజయహో మురళీ నాయక్ 

భారత సైన్యానికి జై 

భారత్ మాతాకీ జై!

No comments: