Tuesday, May 6, 2025

ఓ వాలు జడ వయ్యారీ

అంశం:వాలు జడ


శీర్షిక: ఓ వాలు జడ వయ్యారీ

ఓ వాలు జడ వయ్యారీ
నను నీ దరి చేరనీయవా ఓ సారీ
నా హృదయం నిండా నీ మధుర స్మృతులే 
మనసును పులకరింప జేస్తున్నవే!

జడ కుచ్చుల గంటలు బడి గంటల వలె
నా గుండెల్లో ధడ పుట్టిస్తున్నాయే
కారు మేఘాల వంటి నీ కురులు
కనులను కనువిందు చేస్తున్నాయే!

నాగ స్వర్పం లాంటి నీ పొడుగాటి
వాలు జడ బుసలు కొడుతున్నదే
బుంగమూతితో నీవు బెంగ పెట్టుకోకే
చందమామ వంటి నీశసుందర మోముకు
మబ్బులు అడ్డు పడినట్లుండునే !

నల్లని కురులతో వాలు జడ అల్లిక
కట్లపాము వలె మెలికలు తిరిగిపోతోంది
తలలోని ధవళ మల్లెపూల దండలు
శివుడి తలమీద నున్న చంద్రవంకలా
సింగారించుకుని కుదురుగా కూర్చుని
గిలిగింతలు పెడుతున్నట్లుగా ఉంది!

ఓ వాలు జడ వయ్యారీ
నను నీ దరి చేర నీయవా ఓ సారీ!


No comments: