కవితా శీర్షిక: అంతర్జాల వ్యాపారం
(ఆన్లైన్ బిజినెస్)
కరోనా తాకిడికి చెదిరే ప్రపంచం,అల్లాడే జనం/
బ్యాంకుల్లో డబ్బున్నా,లేకుండే ప్రయోజనం/
అంతర్జాల విధానం ఆశాజ్యోతిగా కనబడే/
అమేజాన్ ప్లిప్ కార్ట్, బిగ్ మార్ట్ సంస్థలు నాడే!/
రక రకాల ఆప్ లతో, రక రకాల ఆఫర్లుపెట్టే/
మేయిల్స్ మెస్సేజ్ లతో వరుసకట్టే/
ఇక చరవాణులు, 'వైఫై' లు సులువైపోయే/
వస్తువుల ఎంచుకునే, సబ్మిట్ నొక్కే!/
గంటల్లోవేడి వేడి భోజనాలు ఇంటికి వచ్చే/
వస్తువులైతే వారం రోజుల్లో వచ్చే/
అన్ లైన్లో డబ్బులు చెల్లించే, హాయిగా జీవించే/
అంతర్జాల విధానం జనులకు అలవాటై పోయే!/
సంస్థల వద్ద పూర్తి అడ్రసులు రిజిష్టరాయే/
ప్రజల అభిరుచులు మార్టులకు తెలిసి పోయే/
పేదలెవరో ధనికులెవరో పూర్తిగా యెరుకాయే/
ఆర్ధిక స్థోమతలన్నియు అవగత మాయే!/
నిల్వ ఉండలేని ,గుర్తు పట్టలేని పదార్ధాలకు/
ఆధరణ తక్కువ , ఆఫర్లు ఎక్కువ/
ఆర్డర్ ఒకటిచేస్తే మరొకటివచ్చే, గుర్తుపట్టరాకుండే/
ఆన్లైన్లో డబ్బు చెల్లించే, తింటూ పోతుండే!/
సైబర్ నేర గాళ్ళకు నేడు అంతా సులువాయే/
ఎవరి యిష్టాలు,బలహీనతలేమిటో విశదమాయే/
యేమరపాటుతో ఉంటే,ఎక్స్ రే కన్నులాయే/
ఫిషింగ్ మేయిల్స్ పంపి,బ్యాంకునిల్వల నూడ్చివేసే!/
అంతర్జాల విధానం , రెండంచుల ఖడ్గం/
ఆడమర్చామా , జీవితాలు ఆగమాగం/
No comments:
Post a Comment