Wednesday, May 7, 2025

నచ్చిన సినిమా/ తాతా మనువడు

అంశం: నచ్చిన సినిమా


సినిమా పేరు: తాతా మనవడు (1973)
రచయిత పేరు: సినారె
సంగీత దర్శకత్వం: రమేష్ నాయుడు
పాట పాడిన వారు: రామకృష్ణ
నటీ నటులు: ఎస్వీ రంగారావు , అంజలి

శీర్షిక:  *అనుబంధం ఆత్మీయత అంతా బూటకం*

తల్లితండ్రులను వదిలి స్వార్థంతో
ఉన్నత స్థాయిలోఉన్న అమ్మాయిని
పెళ్లి చేసుకోడానికి వెళ్తాడు కొడుకు
అక్కడ పెళ్లి జరుగుతుంటుంది.
ఇక్కడ తల్లి అనారోగ్యంతో కన్నుమూస్తుంది
కొడుకు అక్కడే పెళ్లి వేడుకలో ఉంటాడు
తాతా మనువడు చిత్రం చూస్తుంటే
మనసు చలించి పోతుంది

అనుబంధం ఆత్మీయత అనేది బూటకం
ఆత్మ ప్రక్షాళనకు మనుషులు ఆడే నాటకం
తల్లెవరూ తండ్రెవరూ కొడుకెవరూ
ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు!

ఎందుకో ఆ ఎడతెగని బంధం
కొన ఊపిరిలో ఉన్నపుడునూ
ఎందుకు ఈ అణగారిన అనుబంధం
కరిగే కొవ్వొత్తిపై కనికరం ఉండదు
ఆ కాలుతున్న వెలుగే కావాలి అందరికీ!

కొడుకు అనేవాడు నీకు ఒకడు ఉన్నాడు
కానీ,వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడు
నిన్ను చివరిసారి కూడా చూడడానికి రాలేదు
వల్లకాటికైనా వస్తాడన్న ఆశ నాకు లేదు
ఎవరు తల్లీ నీ ఆత్మ ఘోషను వినేది
ఏ తల్లీ కనకూడదు ఇలాంటి కొడుకును!

పరాయుల గురించి పట్టించుకునే మూర్ఖునికి
కన్నవారి కడుపు కోత ఎలా తెలుస్తుంది
తారా జువ్వల కాంతిలో లీనమైన ఉన్మాధికి
చితి మంటల చిటపటలు వినిపిస్తాయా
ఆ చితి మంటల సెగలు కనిపిస్తాయా!

అంటూ తండ్రి విలపిస్తుంటే పరాయివాళ్ళ
గుండె కరిగింది కానీ కొడుకు గుండె కరుగలేదు
ఇంతటి మంచి నీతి ఉంది కాబట్టి
నాకు బాగా నచ్చింది!
     

No comments: