అంశం: టుడే స్టార్
శీర్షిక: *చరిత్రలో మిగిలేవి మంచి చెడులే*
మనిషి ఏదో ఊహించుకుంటాడు
ఏవేవో కలలు కంటాడు
చదువు కోవాలనీ
పెద్ద ఉద్యోగం చేయాలనీ
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనీ
ఓ పెద్ద స్టార్ కావాలనీ
ఓ గొప్ప కళాకారుడు కావాలనీ
అందమైన భాగస్వామిని పొందాలనీ
చక్కని పిల్లలను కనాలనీ
వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలనీ
గౌరవంగా బ్రతకాలనీ
మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలనీ
చిరస్థాయిగా చరిత్ర పుటలలో నిలువాలనీ
రకరకాల ఊహలతో కోరికలతో
మనిషి ఎంతో కృషి చేస్తాడు
కానీ అనుకున్నది ఏదీ జరుగక పోవచ్చు
ఎందుకంటే అది ముందే దైవ నిర్ణయం
జరిగి పోయి ఉంటుంది
అవి ఎవరో ఒకరిద్దరికే పరిమితమై ఉంటుంది
కలలు కనడంలో తప్పు లేదు
అది సాధించడానికి కృషి చేయడం తప్పుకాదు
సమయం వెచ్చించడం తప్పు కాదు
కానీ కోరింది లభించక పోతే
నిరాశ చెందడం తప్పు దుఃఖించడం తప్పు
ఇవన్నీ జీవితంలో ఒక భాగమే కానీ
అవే జీవితం కావు
చిర చరాస్తులు బంధు మిత్ర సంబంధాలు
ఏవీ శాశ్వతం కావు అవి ఏవీ మన వెంటరావు
శాశ్వతం కాని వాటికొరకు దుఖించడం తగదు
చరిత్రలో మిగిలేవి మనం చేసే మంచిచెడులే!
No comments:
Post a Comment