Saturday, May 17, 2025

కాశ్మీర్ - ఉగ్ర దాడి / ఛేకాను ప్రాస అలంకారాలు

 అంశం: అలంకారాలు

(ఛేకానుపాస అలంకారాలు)

శీర్షిక: కాశ్మీర్ - ఉగ్రదాడి

కాశ్మీర్ లో ఉంది వైష్ణోదేవి దేవా *లయం లయం* గానూ వినిపిస్తుంటాయి అక్కడ మంత్రాలు

కాశ్మీర్ ప్రాంతమంతా *చల్ల  చల్ల* ను కూడా అమ్ముతారు అచట

ఎత్తెన మంచు కొండలు, అక్కడ అడవులు ధట్ట *మైన  మైన* ము లభించు తరువులు లేవు

ఇంకాస్త లోపలికి వెళ్తే  గు *హలు హాలు* వలే పెద్దగా ఏర్పాటు చేసుకుంటారు. అవే ఉగ్రవాదుల తావురాలు.

కొందరు కశ్మీరులకు ఉగ్రవాదులకు సం *బంధ బాంధ* వ్యాలు ఉన్నాయి

ఏ సంబంధాలు లే *కుండా కుండ* లోని మంచి నీరు కూడా ముట్టరు ఉగ్రవాదులు

పహల్గాంకు యాత్రి *కులు కులు* కడినికే వస్తారని ముందే పసిగట్టారు ఉగ్రవాదులు .

ఏజెంట్లకు ఎంతో కొంత స *ర్దారు దారు* ల్లోనే.

యాత్రికులు ఏజెంట్లను న *మ్మారు మారు* మాట్లాడకుండా వారి వెంట వెళ్ళారు.

ఏవో శబ్దాలు వినబడుతున్నాయి అని అడుగుతే
తడ *బడి బడి* లోనే కూర్చోన్నారట ఏజెంట్లు.

ఎంత వి *చిత్రం చిత్రం* గీసి నట్లే ఉగ్రవాదుల ప్లాన్లు
అమలవుతున్నాయి.

మహిళల సింధూ *రాలు రాలి* పోతున్నాయి ఒక్కొక్కరివి

హాహా కారాలు పెహాల్గాం లోయ చుట్టుప *క్కల కల* వర పెడుతున్నాయి జనుల.

అక్కడికి సాధారణంగా పోలీ *సులు సుల* భంగా
పోలేరు ఆ ప్రాంతానికి.

వాస్తవానికి రెండు రోజుల తరు *వాత వాత* పెట్టడానికి పెహల్గాంలో మిలిటరీకి అనుమతి ఉంది.

అనధికారి *కంగా కంగా* రుగా ఏజెంట్లు ఉగ్రవాదులు కుమ్ముక్కయి తెరిచారు.

అది యాత్రికులకు శా *పంగా పంగా* నామాలు పెట్టారు ఏజెంట్లు.

మనుషులను ఎవరిని నమ్మాలో నమ్మ కూడదో తెలుసు కో *వాలి వాలి* వలె.
రగిలి పోయిన భారత ప్రభుత్వం సింధూజ *లాల లాలి* త్యంతో నిలిపి వేసింది. ఒప్పందాన్ని రద్దు చేయలేదు.

ఉగ్రవాదుల నరాలలో పారే రుధిర చు *క్కలు కలు* షితమై ఇస్లామిక్ ఇస్లామిక్ అంటున్నాయి 

No comments: