Saturday, May 10, 2025

సరస్వతీదేవి /ముక్త ప్రదగ్రస్తాలంకారాలు

అంశం:ముక్తాపదగ్రస్తాలంకారాలు


శీర్షిక: *సరస్వతీ దేవీ*

బ్రహ్మ కు ఇల్లాలువై భువిన వెలసిన *సరస్వతీ దేవీ*
*సరస్వతీ దేవీ* నీవు జనులకు  *ఇలవేల్పువు*
*ఇలవేల్పువు* మీరు మా చదువుల *తల్లివి*
*తల్లివి* గా దీవించెదవు నిత్యం *విద్యార్థుల*

*విద్యార్థుల* జ్ఞానాన్ని పెంచేటి  *వాగ్దేవీ*
*వాగ్దేవీ*  హంస వాహిని  *వీణా వాణి*
*వీణా వాణి* పుస్తక ధారిణి *కాత్యాయనీ*
*కాత్యాయనీ* కమల హస్త ధారిణి *వాగేశ్వరీ*

*వాగేశ్వరీ* సకల జనులకు బుద్ధిని ప్రసాదించే *విద్యా దేవి*
*విద్యా దేవి*  వజ్రకిరీటి  *ధవళ వస్త్ర ధారిణి*
*ధవళ వస్త్ర ధారిణి* స్వచ్ఛతకు మారుపేరు అమ్మా మీరు *శారదాదేవి*
*శారదాదేవి* నీవు శరత్ ఋతువులో జన్మించితివి తల్లీ *భారతి*

*భారతీ* అని భారత దేశంలో ముద్దుగ పిలిచెదరు మిమ్మల్ని *ఓ బ్రహ్మ చారిణి*
*ఓ బ్రహ్మచారిణి* బహుముఖ ప్రజ్ఞాశాలి వమ్మా  *బ్రహ్మ సతి*
*బ్రహ్మ సతి* వై ఇలన వెలుగు నింపుతున్న  *జగత్ ఖ్యాతి*
*జగత్ ఖ్యాతి* గాంచి సర్వ సంపదలను కూర్చిన తల్లీ  *వసుధ*

*వసుధ* గా వసుధ కే వన్నె తెచ్చిన  *కౌమారి*
*కౌమారి* మీకు ప్రీతి పాత్రురాలైనది *మయూరి*
*మయూరి* వయ్యారి నాట్యం కనువిందు చేయు మిమ్మ *కళల తల్లీ*
*కళల తల్లీ*  సంగీతాన్ని ఆస్వాదించే వీణా వాణి

No comments: