Sunday, May 11, 2025

ఆపరేషన్ సిందూర్

 శీర్షిక:జయహో వీర జవాన్!


విజృంభించరా వీర సైనికుడా!
ఇరువది ఏడు మంది యాత్రికులను
లాగులిడిచి పరీక్షించి హతమార్చి
సింధూ నదీ జలాలలో రుధిరం పారించిరి
కాశ్మీరు మంచు కొండలను రక్తసిక్తం చేసి
వారి మహిళల నుదుటి సింధూరం చెరిపేసిన
మతోన్మాద ఉగ్రవాదుల మొక్కవోని ధైర్యంతో
ప్రతిష్ఠాత్మకమైన *ఆపరేషన్ సింధూర్* లో
సమరసింహంలా పోరాడారా వీరుడా
ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపారా
నక్కజిత్తుల పాకిస్థాన్ బింకమనుచరా
విజృంభించరా వీర జవాన్

జయహో వీర జవాన్ 
జయజయహో వీరజవాన్

No comments: