Wednesday, April 30, 2025

తల్లిదండ్రులు తూర్పు పడమరలైతే

అంశం: యాక్సెప్ట్ మై ఛాలెంజ్ 

శీర్షిక: తల్లి దండ్రులు తూర్పు పడమరలైతే ?


ఆవులు ఆవులు పోట్లాడు కుంటే 

దూడల కాళ్ళు విరుగుతాయంటారు

తల్లిదండ్రులు నిత్యం పోట్లాడు కుంటుంటే 

పిల్లలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది!


తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా జీవించాలి 

తల్లిదండ్రులు మొదటి గురువులు లాగానే 

పిల్లలకు గృహమే మొదటి పాఠశాల 

వారు నిత్యం తల్లిదండ్రులను అనుకరిస్తారు!


ఆదర్శంగా ఉన్నవారిని పిల్లలు ఇష్టపడుతారు

అలాంటి వారిని పూర్తిగా నమ్ముతారు

వారు ఏది చెప్పినా పిల్లలు అదే తప్పకచేస్తారు 

ఏది చేయకూడదు అంటే దానిని చేయరు!


తల్లిదండ్రులు చెడు చేయమంటే చెడేచేస్తారు 

నిజం మాట్లాడమంటే నిజమేమాట్లాడుతారు

అబద్దమాడమంటే అబద్దమేమాట్లాడుతారు 

అదే సరియైనది కావచ్చని  అనుకుంటారు!


ఇంతటి భద్యతా యుత స్థానంలో ఉన్న 

తల్లిదండ్రులు తూర్పు పడమరలా 

చికాకులు గొడవలతో కాలం గడుపుతే 

పిల్లల విలువైన సమయం వృధా అవుతుంది 

సంఘ విద్రోహ శక్తులుగా మారుతారు!

No comments: