Sunday, June 1, 2025

నీ మనఃస్సాక్షే నీకు నిజమైన కోర్టు

శీర్షిక: *నీ మనఃస్సాక్షే నీకు నిజమైన కోర్టు*


ఆకాశం అంచులో
అందమైన హార్మ్యాలు
పేదలకు అందకుండ పోతున్నవి
వాటి ఆనవాలు!

అవి ఎంత ఎత్తుకు ఎగిసినా
ధనికులు పై అంతస్తులలో నివసించినా
గడువు కాలం వచ్చు సమయానా
నేలకు చేరెదరు ఎట్టకేలకైనా
నలుగురు పేదలే కదా మోసేది కాటికైనా !

రైలు పట్టాలలా సాగుతున్నవి
మానవ సంబంధాలు
ఎడారులలో ఎండమావులలా
ఆర్ధిక అంతరాలు!

నడమంత్రపు సిరితో గర్వం పెంచావో
జీవన గమనంలోనే సర్వం కోల్పోతావు
సాగ దీయకెపుడు సమస్యల వలయాలను
చాటుగా మాటుగా నైనా నిన్ను నీవు తెలుసుకో
నీ మనఃస్సాక్షే  నిజమైన కోర్టు!


No comments: