Thursday, June 5, 2025

నవ్విన నాప చేనే పండు తుంది

*నేటి అంశం -కవితాపూరింపు*


శీర్షిక: *నవ్విన నాపచేనే పండుతుంది*

పూరి గుడిసెలో తొంగి చూసే చల్లని కిరణాలు
పొయ్యిలో లేవని పిల్లిని చూసి
పక పక నవ్వితే
ఆకలి పేగుల ఆర్తనాదాలు విని చంద్రుడు
భయపడి పారిపోకుండా ఉంటాడా...!

ఎవరికైనా కష్టాలు సుఖాలు సంతోషాలు
దుఃఖాలు బాధలు ఆనందాలు సహజం
ఎండమావుల వలె వస్తుంటాయి పోతుంటాయి
*నవ్విన నాప చేనే పండుతుంది* అన్నట్లు
ఏదో ఒక రోజు పొయ్యిలో భానుడు
మంటను పుట్టించ వచ్చు
*నారు పోసిన వాడే నీరు పోస్తాడు* అన్నట్లు
ప్రతి ఒక్కరికీ మంచి రోజులు వస్తాయి
*నోరు మంచిదైతే ఊరు మంచిదే* అన్నట్లు
ఎదుటి వారితో ప్రేమగా నమ్మకంగా
నిజాయితీగా ఉంటే చేతిలో డబ్బు లేకున్నా
ఈ ప్రపంచాన్ని జయించ వచ్చు
టీ అమ్ముకుని జీవించే నరేంద్ర మోడీ ఈ రోజు
ప్రపంచంలోనే హీరో
కూలి పని చేసుకుని జీవించే ద్రౌపది ముర్ము
ఈ రోజు భారత రాష్ట్రపతి
వేప గింజలు ఏరుకుని బ్రతికిన డా. కలాం
మాజీ భారత రాష్ట్రపతి, మిస్సైల్స్ రూపకర్త!

No comments: