శీర్షిక: ఆశ జీవకోటి శ్వాస
ప్రక్రియ: పద్యంఆ.వె:01
ఆశ జీవకోటి శ్వాసనెప్పుడునైన
కోతికనియె కాదు నాతికైన
మరల దొరకవనియు యరటిపండ్లనుపట్టి
వానరము కదిలెను కానరనియు!
ఆ.వె:02
సాగు చుండె కోతి సాత్విక జంతువు
అందముగను నడిచి యడవిలోకి
పూటకొకటినంటు నోటను చేతుల్లో
అరటి పండ్లు పట్టి నాగకుండ!
No comments:
Post a Comment