అంశం: యుద్దోన్మాదం
శీర్షిక: *అగ్రదేశాల యుద్దోన్మాదం*
ఏమిటీ ధారుణం?
ఎందుకీ మారణ హోమం?
ఉనికి కోసమా ఉన్నతి కోసమా?
అగ్ర దేశాల స్వేచ్ఛ అంటే ఇదేనా?
ప్రపంచ దేశాలకిచ్చే సందేశమిదేనా?
ఎడతెరుపని బాంబుల మోత
తోటి సైనికులనీ చూడకుండా ఊచ కోత
మానవ గృహాల , భవనాల కూల్చివేత
యిక ఇంతేనా బలహీన దేశాల తలరాత!
యుద్ధవిమానాలు దూసుకుపోతుండే
జవానులు పిట్టల్లా నేల రాలుతుండే
దేశ ఆస్తులు సంపదలు భస్మమై పోతుండే
ప్రజలు,విదేశీయులు పరుగులు పెడుతుండే
విశ్వమంతా కాలుష్యంతో నిండి పోతుండే!
ఎటు చూసినా ఉన్మాద యుద్దాలే
వొల్లు జలదరించి కంటికి కునుకు పోయే
నోట మాట రాక నోట్లోకి కూడు పోక
జనులుండే నివురుగప్పిన నిప్పులా!
గతంలోనే హెచ్చరిక చేశాడు పెద్దన్న
అణు స్థావరాల లెక్కలు చూపమని
ఇరాన్ ససేమిరా అంటూ ఇజ్రాయిల్ పై
కసిపెంచుకుని కయ్యానికి కాలు దువ్వే!
పడుకున్న సింహాం జూలు పట్టి లాగి
ఇజ్రాయిల్ ను రెచ్చగొట్టిన ఇరాన్ కు
తగిన శాస్తి జరుగుతున్నది
సర్వం భస్మీపటలం అవుతున్నది!
నాలుగు రోజులాయే యుద్ధం మొదలై
ఎందరో సైనికులు శాస్త్రవేత్తలు హతమైరి
శాస్త్ర వేత్తలు సామాన్యులు తోడైరి
ఐక్య రాజ్యసమితి ఉండి ప్రయోజనమేమి?
అంతర్జాతీయ కోర్టు సుమోటోగా చేపట్టాలి
యిక నైనా యిరు దేశాలం యుద్దమాపాలి
అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలి
యుద్దోన్మాద దేశాలపై ఆంక్షలు విధించాలి
ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి!
No comments:
Post a Comment