Friday, June 20, 2025

రంగు రంగుల చెక్క బొమ్మలు

అంశం: బొమ్మల కొలువు 
శీర్షిక: రంగు రంగుల చెక్క బొమ్మలు

పిల్లల్లారా పిడుగుల్లారా
బొమ్మలు పిల్లల బొమ్మలు
సహజ రంగుల బొమ్మలు
అందమైన చెక్క బొమ్మలు!

చిన్న చిన్న పిట్టల బొమ్మలు
రామ చిలుకల బొమ్మలు
చక్రాల బండ్ల బొమ్మలు
పాలకొడిశ కట్టె బొమ్మలు !

దొంతుల బొమ్మలు
అమ్మానాన్నల బొమ్మలు
సీతా రాముల బొమ్మలు
దేవతల దేవుళ్ళ బొమ్మలు!

సుందరమైన నిర్మల్ బొమ్మలు
సంక్రాంతి దీపావళి పండుగల్లో
కొలువు దీరు మా ఇంట బొమ్మలు
రంగు రంగుల కొండపల్లి బొమ్మలు!

పిల్లలకు పెద్దలకు అతిధులకు
ఆనందాన్నిచ్చు బొమ్మలు
కళాకారులకు కార్మికులకు
ఉపాధి కల్పించు చెక్క బొమ్మలు!

సాంప్రదాయ బొమ్మలు
సంస్కృతి కాపాడు బొమ్మలు
రేపటి తరాలకు బొమ్మలు
వరాల నిచ్చు చెక్క బొమ్మలు!

చెక్క బొమ్మలను కొనాలి
బేరసారాలు ఆడ కుండాలి
బొమ్మలను ప్రోత్సహించాలి
కళలను బ్రతికించుకోవాలి!
  

No comments: