Thursday, June 12, 2025

అమ్మా నాన్నలు

 శీర్షిక: అమ్మ నాన్నలు


అమ్మంటే
ఆత్మ
నాన్నంటే
పరమాత్మ

అమ్మానాన్నలు
సృష్టి కర్తలు
ఆది అంతాలకు
మూల కర్తలు

జీవన ప్రదాతలు
నిస్వార్థ త్యాగధనులు
నిరంతర శ్రమ జీవులు
నిత్య శోధకులు

కన్న బిడ్డలను
కంటికి రెప్పలా
కాపాడుకునే
అంగ రక్షకులు
నిత్యం
శ్రమిస్తూ
కష్టపడుతూ
తాము
తిన్నా తినకున్నా
డొక్క మాడ్చుకునైనా
పిల్లల
కడుపు నింపే
త్యాగ మూర్తులు
అమ్మా నాన్నలు

కొడుకులకు
కూతుర్లకు
సత్ప్రవర్తన నేర్పే
సన్మార్గం చూపే
మార్గ దర్శకులు

గొప్ప
ప్రయోజకులను
చేయాలనే
తపన , ఆశయం గల
ఆదర్శ మూర్తులు

వృద్ధాప్యంలో
పోషించినా
పోషించక పోయినా
తనయులు ఎక్కడ ఉన్నా
బ్రతికున్నంత కాలం
చల్లగా ఉండాలని
హాయిగా , ఆనందంగా
సుఖంగా, సంతోషంగా
జీవించాలని
కోరుకునేది
అమ్మా నాన్నలు!




No comments: