Thursday, June 12, 2025

నాన్న కోపానికి అర్ధం బాధ్యత

 అంశం: నాన్నకు ప్రేమతో!


శీర్షిక: నాన్న కోపానికి అర్ధం బాధ్యత

నాన్న గొడుగుకు పై కప్పు లాంటి వారు 
అమ్మ గొడుగుకు స్టాండ్ అవుతే
పిల్లలు గొడుగు పుల్లల వంటి వారు
నాన్నంటే ప్రేమ నాన్నంటే రక్షణ నాన్నంటే ధైర్యం
నాన్నంటే గౌరవం నాన్నంటే త్యాగం నాన్నంటే ఆదర్శం
నాన్నంటే బాధ్యత నాన్నకు నాన్నే సాటి నాన్నకు ఎవరు లేరు మేటి!

నడక నేర్పేది నాన్నే భవిత నిచ్చేది నాన్నే గమ్యానికి చేర్చేది నాన్నే
జీవిత పాఠాన్ని నేర్పేది నాన్నే  క్రొవ్వొత్తిలా కరిగి పోయేది నాన్నే!
అమ్మ శిషువును కడుపున మోస్తే నాన్న తన బుజాన మోస్తాడు!

జన్మ నిచ్చేది అమ్మైతే జీవితాన్ని పంచేది నాన్ననే
వేలు పట్టి నడిపించేది నాన్నానే ప్రపంచానికి వెలుగెత్తి చాటేది నాన్ననే
అమ్మ కమ్మని పాలుపడితే నాన్న తన జీవితాన్నే త్యాగం చేయు
అమ్మ ఇంటిని చూపిస్తే నాన్న ప్రపంచాన్నే చూపించు!

కరుణ యున్న కాఠిణ్యమున్నా బాధ కలిగినా, సంతోషం కలిగినా
కష్టం వచ్చినా , దుఃఖం వచ్చినా తన గుండెల మాటునే, దాచి పెట్టు
నాన్నకు ఏడ్చే హక్కు లేదు స్వాంతన పొందే స్వేచ్ఛ లేదు!

నాన్న కోపానికి అర్ధం బాధ్యత నాన్న బాధకు అర్ధం బాధ్యత
నాన్న దుఃఖానికి అర్ధం బాధ్యత నాన్న ఆనందానికి అర్ధం పిల్లల ఎదుగుదల
నాన్న తన కన్నీళ్ళను అద్దానికి తప్పా భార్యకు కూడా కనపడనివ్వకుండు!

కుటుంబ బాధ్యత మోయుచుండు
కానీ దానిని ఎవరికీ తెలియనీయకుండు
నాన్న ఆలోచనలు ,అనిర్వచనీయం నాన్న వ్యక్తిత్వం ఆదర్శనీయం
నాన్న దూరదృష్టి మహోన్నతం అది ఎంతో మందికి స్పూర్తి దాయకం!

No comments: