అంశం: *సామెతల కవిత*
*1*కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు*
*2 *అందితే జుట్టు అందకపోతే కాళ్ళు*
శీర్షిక: *పచ్చని కాపురంలో నిప్పులు*
అందమైన కుటుంబం వసుదైక కుటుంబం
నీతి నిజాయితీకి నిలువెత్తు అద్దం
దాన ధర్మాలకు ఇంచు మించు కర్ణుడు వలెనే
పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా!
ఎవరు వచ్చినా లేదు కాదు అనకుండా
ఇంతో అంతో తృణమో పణమో ప్రేమతో
ఇచ్చి సాగనంపే వారు దయార్ద హృదయుడు
అందుకే పరంధామయ్య అంటే గొప్ప పేరు!
*పచ్చని కాపురాలలో నిప్పులు* పోసే వారు
శకునిలా మందరలా అడుగడుగునా ఉంటారు
*కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు* అన్నట్లు
పరంధామయ్య మీద ఏదో నింద మోపడం
పోలీసులు పట్టుకుని పోవడం షరా మామూలే!
విచారణలో తేలిన విషయం ఏమంటే
తనకు దక్కని మంచి పేరు పరంధామయ్యకు
వస్తున్నది తట్టుకోలేక పని మనిషికి
డబ్బు ఎర వేసి పోలీస్ స్టేషన్ లో
చెప్పించాడు కౌన్సిలర్ శంకర్ నారాయణ!
విచారణలో తేలాక నాలుగు చివాట్లు పెట్టి
గట్టిగా మందలించి పంపిస్తే
తప్పైందని ఒప్పుకుని పరంధామయ్య
కాళ్ళు పట్టుకుంటాడు కౌన్సిలర్
అందుకే అంటారు మన పెద్దలు
*అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు* అని
పరంధామయ్య క్షమించి పంపించి వేస్తాడు!
No comments:
Post a Comment