Wednesday, June 11, 2025

చదువే అన్నిటికీ మూలం

అంశం: *చదువేగా అన్నిటికీ మూలం*


శీర్శిక: *చదువే సర్వస్వం కాదు*

*చదువే అన్నిటికీ మూలం*
చదువు జ్ఞానానికి మూలం
చదువు విజ్ఞానాకి మూలం
చదువు విజయాలకు మూలం!

*చదువే అన్నిటికీ మూలం*
"నాడు చదువు లేని వాడు వింత పశువు" అన్నారు
"నేడు చదువుకున్న వాడు వింత పశువు " అవుతున్నాడు
చదువే అన్నిటికీ మూలం కాదు!

చదువు ముఖ్యమే
కానీ చదువే సర్వస్వం కాదు
చదువు జీవితంలో ఒక భాగమే
కొందరు ఆంగ్ల భాషే అన్నిటికీ మూలం
అని అనే వారు ఉన్నారు
నేడు మాతృ భాషలతో కూడా
ఎంతో కీర్తిని గడించిన వారున్నారు!

నేడు అక్షరాస్యత పెరిగింది
సైన్స్ అభివృద్ధి చెందింది
సాంకేతిక విజ్ఞానం పెరిగింది
చంద్ర మండలానికి శాటిలైట్లను
పంపించే స్థాయికి ఎదిగారు
క్షిపణులను తయారు చేస్తున్నారు
అణుబాంబులను తయారు చేస్తున్నారు!

అధికంగా చదివి ఏమి సాధించారు?
బిపి షుగర్ రోగాల సంఖ్య పెరిగింది
జనుల మరణాల సంఖ్య పెరిగింది
ప్రజలలో స్వార్ధం అవినీతి పెరిగింది
మోసాలు స్కామ్ ల సంఖ్య పెరిగింది
క్షిపణులతో అణుబాంబులతో
ఒకరికొకరు చంపుకునే జ్ఞానం పెరిగింది
జంతువుల వలె సహజీవన కల్చర్ పెరిగింది!

జీవితానికి చదువు ముఖ్యమే
కానీ చదువే అన్నిటికీ మూలం కాదు
అదే విధంగా భాషే అన్నిటికీ ముఖ్యం కాదు
అన్నిటికంటే ముఖ్యం సంస్కారం
అన్నిటికంటే ముఖ్యం వ్యక్తిత్వం
అన్నిటికంటే ముఖ్యం నీతి నిజాయితీ
అన్నిటికంటే ముఖ్యం తల్లిదండ్రులను
గురువులను పెద్దలను గౌరవించడం
అన్నిటికంటే ముఖ్యం దైవం పట్ల
నమ్మకం పెంచుకోవడం
అన్నిటికంటే ముఖ్యం ప్రకృతిని ప్రేమించడం
అన్నిటికంటే ముఖ్యం భారతీయ
సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం! 

No comments: