Thursday, June 5, 2025

ఇష్ట పదులు/ పర్యావరణ పరిరక్షణ

శీర్షిక : హారితహారంతో హాయిగ జీవిద్దాం

ప్రక్రియ: ఇష్ట పదులు


జీవకోటినెపుడును
జీవించను నిలనను
తరువులు ఉండవలెను
తలపులు పండవలెను
చెరువులు ఉండవలెను
చెలుకలు పండవలెను
ఇసుకను తోడరాదు
ఇగురును కోయరాదు
మొక్కలను పెంచవలె
మోడుచేయకుండుము
హరిత హారముపెంచు
హాయిగా జీవించు
వర్షాలు పడవలెను
వాగులు పొంగవలెను
ప్లాస్టిక్ వాడకమును
పదిలముగ తగ్గించు
వాయు కాలుష్యమును
వడివడిగ తగ్గించు
పర్యావరణమును
పరిరక్షించుతుండు 

No comments: