అంశం: *మృత్యు ప్రయాణం
శీర్షిక: *విధి రాతను ఎవరు తప్పించు కోలేరు**విధి రాతను ఎవరు తప్పించుకోలేరు*
*జీవితం నీటి బుడగ లాంటిది*
*రెప్పతెరిస్తే జననం రెప్పమూస్తే మరణం*
*ఈ మధ్య కాలమే జీవితం*
లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం
అది వందలాది కుటుంబాలకు దుర్దినం
గుజరాత్ విమానాశ్రయం నుండి
టేకాఫ్ చేసిన క్షణాలలో కుప్పకూలే!
రెండొందల నాలుగు మంది ప్రయాణికులు
మృత్యువాత పడిరి
మెడికల్ కాలేజీ భవనాలు మెడికోలు
కుటుంబ సముదాయాలు జనులు
వాహనాలు భస్మీపటలమాయే!
ఒక్కో శవం చూడ హృదయవిధారకం
కట్టె బొగ్గులుగా మారినవి కొన్ని శవాలు
ఆనవాళ్లు కూడా దొరకనివి మరికొన్ని
*తల రాతను ఎవరూ మార్చలేరన్నట్లు*
కలల స్వప్నాలు అగ్నికి ఆహుతయ్యాయి!
ఇంజన్ లో సాంకేతిక లోపాలని
ప్రాధమిక అంచనా
ఒక్కోకుటుంబానికి కోటిరూపాయలు
టాటా ఇండియా కంపెనీ ఇచ్చినా
దేశం *మానవ సంపద* ను కోల్పోవడం
అత్యంత దురదృష్టకరమైన దుర్ఘటన!
విమాన ప్రయాణం ప్రమాదాలకు
కారణాలను తక్షణమే కనుగొనాలి
ఇక ముందైనా ఆకాశయానం
ప్రమాదాలను వెంటనే అరికట్టాలి!
No comments:
Post a Comment