Wednesday, June 4, 2025

జీవిత సత్యం

అంశం:పదాల కవిత

(పరిమళం వెల్లువ మల్లియలు
సుమవనం మధురిమలు)

శీర్షిక: *జీవిత సత్యం*

జీవితం ఎవరికీ నల్లేరుపై నడక కాదు
పట్టుపరుపులతో *పరిమళించే* పూల పాన్పు కాదు
కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి
సంతోషాలు ఆనందాలు ఉంటాయి !

పొగడ్తలకు గౌరవాలకు పొంగి పోకూడదు
తెగడ్తలకు అవమానాలకు కృంగి పోకూడదు
స్థితప్రజ్ఞత అవలంబిస్తూ ధర్మంగా ఉంటే
జీవితంలో *మల్లియలు* కురుస్తాయి!

జీవించడానికి డబ్బు సంపాదించాలి
కానీ ఆ డబ్బు గర్వాన్ని పెంచకూడదు
గర్వం పెరిగితే సర్వం కోల్పోతారు
అత్యాశలు లేని జీవితాలు *సుమవనం* లా
మనోహరంగా ఉంటాయి!

అలాంటి కుటుంబంలో *మధురిమలు*
*వెల్లువ* లా కురుస్తాయి
కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా జీవిస్తారు
డబ్బు అనేది సుఖాన్ని హాయినిస్తుందని
కానీ ప్రేమానురాగాలు దయ కరుణ ధర్మం
ఆనందాలు సంతృప్తినిస్తాయన్న
జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు!

 

No comments: