అంశం: వ్యక్తిత్వ స్థిరత్వం
శీర్శిక: విలువలతో కూడిన జీవన శైలి
వ్యక్తిత్వం ఎండమావులుగా కాకుండా
నిత్యం జీవనదిలా జీవించినంత కాలం
సృజనాత్మకతతో సాగిపోతూ ఉండాలి
అప్పుడే వ్యక్తిత్వం స్థిరత్వమని చెప్పవచ్చు!
మంచి నడవడిక ప్రవర్తన ఆలోచన
నీతి నిజాయితీ నిబద్ధత నిశ్చలత
విలువలతో కూడిన జీవన శైలి
మాట తప్పకుండా ధర్మంగా ఉండటం
సమయ పాలన సత్యం మాట్లాడటం
క్రమశిక్షణతో జీవించడం
తోటి వారి పైన ప్రేమ దయ కరుణ చూపడం
వంటి సద్గుణాలు వ్యక్తిత్వానికి ప్రతీకలు!
*ఓడ దాటే దాకా ఓడ మల్లన్న*
*ఓడ దాటాక బోడి మల్లన్న* లా
అవసరాల కోసం నటించడం
అవసరం తీరాక విమర్శించడం
వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గుర్తింపబడడు!
వ్యక్తిత్వం గుణాలు ఏ ఒక్క రొజో
రెండు రోజులో కాకుండా
ఎల్లప్పుడూ ఉండేటట్లు చూసుకోవాలి
అప్పుడే వ్యక్తిత్వ స్థిరత్వం అంటాము!
గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమహంస
స్వామి వివేకానంద శ్రీరాముడు శ్రీకృష్ణుడు
మరెందరినో స్థిరత్వ వ్యక్తిత్వం గల వారిగా
చెప్పుకోవచ్చు!
No comments:
Post a Comment