Friday, June 6, 2025

గడియారం (బాల గేయాలు)

అంశం: గడియారం (బాల గేయాలు)


శీర్శిక: *గెలుపు ఓటమికి మధ్య తేడా ఒక సెకనే*

ఆహా ఓహో గడియారము
సుందరమైన గడియారము
చంద్రుని వలె ఆకారము
అది మా గోడ గడియారము!

చుట్టూ పన్నెండు అంకెలు
ఉంటాయి మూడు ముల్లులు
పెద్ద ముల్లు చిన్న ముల్లు సన్నముల్లులు
చూపును గంటలు నిమిషాలు సెకనులు!

సృష్టికి ప్రతి రూపము గడియారము
ఎవరు పెట్టారో దానికి ముహూర్తము
తిరుగుతాయి తెల్లవార్లూ నిత్యము
ఆగవు ముల్లులు ఎప్పుడు సుతరాము!

సన్నముల్లు చూపుతుంది సెకనులనే
గెలుపు ఓటమికి మధ్య తేడా ఒక సెకనే
పేద ధనిక ప్రాంత భేదముండదు కనుకనే
ఎంతో విలువైనది సమయం అందుకనే!
 

No comments: