అంశం: ఐచ్చికం
శీర్షిక: *ఏరువాక*
నల్ల నల్లని మబ్బులతో నైఋతి వర్షాలు
అందివచ్చే కాలం వారం ముందుగానే
పులకరించి పోయే పుడమి పండువెన్నెలవోలే
పరవసించిరి రైతన్నలు పగలు రేయి అనక!
జేష్ట పౌర్ణమిరోజు చిత్తముతో రైతు
వృషభములన్నింటిని ఉదకముతో శుద్ధి చేసి
హలముల పూజించి ఆనంద మొందేరు
ఏరువాక వర్షాలు యేర్లుగా పారు!
చిన్న చిన్నగ నిలన చిరుజల్లులుకురువ
నెఱ్రెలు బాసిన నేలలు నిండిపోవు
ఆరుద్ర పురుగులు యవనిలో తిరుగగా
తరువు కొమ్మల నీరు ధరణి చేరు!
తొలకరి సంబరం తొలుతరైతులకేను
వివిదరకములైన విత్తనముల
నాగలి పనిముట్ల నచ్చిన విధముగా
సరిచేసి సమకూర్చి సాగి పోవు!
దారు లన్నియు బురుదలో దాగి పోయె
దుక్కి దున్ని రైతన్నచదునగ జేసి
పొలములోమడి కట్టియు పోసె నారు
తొలకరి వసంత మెల్లయు తోడు నిలుచు!
No comments:
Post a Comment