Monday, June 9, 2025

సంస్కృతి పరిరక్షణ

అంశం: *సంస్కృతి పరిరక్షణ"


శీర్శిక: *సంస్కృతి దేశ గౌరవానికి ప్రతీకలు*

*సంస్కృతి సంప్రదాయాలు*
దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు*
*దేశ గౌరవానికి ప్రతీకలు*
*దేశ ఉజ్వల భవిష్యత్తుకు కల్పవృక్షాలు!*

"సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కోసారి
అణుబాంబు కంటే శక్తి వంతమైనవి"

*ఏ దేశమేగినా ఎందు కాలిడినా*
*ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా*
*పొగడరా నీ దేశ నిండు గౌరవం* 
అని రాయప్రోలు గారు అన్నట్లు
*ఏ దేశమేగినా ఎందు కాలిడినా*
*చాటరా నీ దేశ గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు*
*తరిమి కొట్టరా పాశ్చాత్య సంస్కృతి విశ సాంప్రదాయాలు!*

సంస్కృతి అనేది ఒక తరం నుండి
మరొక తరానికి అలవోకగా వచ్చు
ఆచారాలు సాంప్రదాయాలు అలవాట్లు
నమ్మకాలు విశ్వాసాలు విలువలు కళలు
జ్ఞానం సాంకేతిక నైపుణ్యాలు పద్దతులు
సంస్కృతి అనేది మన జీవన విధానం
సంస్కృతి అనేది చతుర్వేదాలు
పురాణాలు ఇతిహాసాలు చతుష్షష్టి కళలు!

లౌకిక దేశమైన భారత దేశంలో
భిన్న మతాలు కులాలు భాషలు ప్రాంతాలు
మరెన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలు
పలురకాల పండుగలు వివాహోత్సవాలు
ఆహార్యం  ఆచారాలు ఎవరివి వారివే!

ఇంత గొప్ప మహత్తరమైన సంపద
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు
సుఖ జీవనం గడపడానికి మరియు
రేపటి తరాలకొరకు పరిరక్షించాల్సిన బాధ్యత
ప్రతి ఒక్క భారతీయుడి పైనా ఉంది!

No comments: