Thursday, June 5, 2025

బంధాలకు అడ్డుగోడలు

 అంశం: గోడ.. గోడలు.. అడ్డంకి


శీర్షిక: *బంధాలకు అడ్డుగోడలు*

*మనిషి గోడ కాదు*
*మనుషులు గోడలు కారు*
*మనిషి ఎడారి జీవి కాదు*
*మనిషి సంఘ జీవి*
*పది మందితో కలిసి జీవించాలి*
*మనిషి బంధాలకు ఏ అడ్డంకి ఉండకూడదు*

*రావి చెట్టు ఉసిరి చెట్టు కలిసి*
*బంధంగా పెరిగితే ఎంత పవిత్రత ఏర్పడుతుందో*
*ఒకింటి యువకుడు మరొక ఇంటి యువతితో*
*కుటుంబ సభ్యులంతా బంధంగా కలిసి జీవిస్తే*
*అంత విలువ పవిత్రత ఉంటుంది*

*తరువుకు భూమి ఎంత ముఖ్యమో*
*చెరువుకు నేల ఎంత ముఖ్యమో*
*మేఘాలకు తరువులు చెరువులు ఎంత ముఖ్యమో*
*మనిషికి మరో మనిషి తోడు అంతే ముఖ్యం*
*మనిషికి మనిషి అడ్డుగోడ అయితే*
*మనిషికి మనసు అడ్డుగోడగా మారితే*
*జీవితాలే శూన్యం*

*శిశువు బొడ్డు పేగుతో కలిసే జన్మిస్తుంది*
తప్పని పరిస్థితిలో డాక్టర్ బొడ్డుతాడు కత్తిరిస్తాడు
కానీ జీన్స్ రధిరం తోనే శిశువు లోకి ప్రవేశిస్తాయి
అలా రక్త సంబంధాలు ఏర్పడుతాయి
ఆలుమగలతో బంధువులతో బంధాలుఏర్పడు
అలాంటి ఆలుమగల బంధాలలో అడ్డంకులు
ఏర్పడితే జీవితాంతం అగమ్యగోచరమే

ఋతువులకు తరువులకు 
పంచ భూతాలకు పంచేంధ్రీయాలకు
రుధిర సంబంధాలు ఉండక పోవచ్చు
కానీ మానవులకు రక్త సంబంధాలు ఉంటాయి
భార్యా భర్తలకు కన్న బిడ్డలతో సంబంధాలు
ప్రేమానురాగాలతో బంధాలు ఉంటాయి!

అయితే బంధాలకు కొన్ని హద్దులు ఉండాలి
కానీ అడ్డుగోడల వలె ప్రతిబంధకాలు కాకూడదు
బంధాలకు ప్రేమలు గౌరవాలు ముడిపడి ఉంటాయి
బంధాలు వ్యక్తి స్వేచ్ఛను *బంధీ చేయవచ్చు*
మనిషి ఎదుగుదలను నిలిపి వేయవచ్చు
దేశాన్ని విడిచి ఉద్యోగాలు చేయలేరు
*బంధాలలో బంధీ అవుతే* వారు గతించినచో
తట్టుకుని బ్రతకడం చాలా కష్టం అవుతుంది !

బంధాలు అనుబంధాలు 
రక్త సంబంధాలు ప్రేమానురాగాలు ఉండాలి 
కానీ అవి ఉభయులకూ సానుకూలమైన
హద్దులలో  బంధాలకు అడ్డుగోడలు గాకుండా 
ఉంటే జీవితాలు సుఖమయం!

No comments: