Monday, June 9, 2025

రైతుల సంతోషాల పరవళ్ళు

అంశం: పదాల పదనిసలు

శీర్షిక: *రైతుల సంతోషాల పరవళ్ళు*

*పొంగళ్ళు* చేయడం ఆనవాయితీ కొత్త పంటలు వచ్చినప్పుడు...
ఇక సందళ్లే *సందళ్ళు* ప్రతి ఇంటా పచ్చపచ్చని మామిడి తోరణాలతో...
*నాగళ్ళు* సరిచేసుకుని దున్నుతారు పొలాలు చెలుకలు తొలకరి జల్లులతో...
చెరువులు నిండి మత్తళ్ళు పడి నీరు *పరవళ్ళు* తొక్కుతాయి..
*ఎడ్లబళ్లు* కడుతారు రైతులు కూలీలు వరి ధాన్యాన్ని తేవడానికి...
చలికాలంలో  *కంబళ్లు* కప్పుకుని వరికుప్పల వద్ద కావలిగా పంటారు..
*కావిళ్ళు* కట్టుకుని మోసుకొస్తారు వరినారును ఎంతదూరం నుంచైనా..
ఉషోదయాన్నే కళ్ళాపి చల్లి *వాకిళ్లు* నిండుగా రంగుల ముగ్గులు పెడుతారు...
రకరకాల పిండివంటలు చకినాలు అర్షలు చేస్తారు ఇంట్లో *ఆడాళ్లు*..
పంట చేతికి వచ్చిన సంతోషంలో *దున్నుళ్లు* అలసట మరిచిపోతారు

 

No comments: