Friday, June 6, 2025

ప్రేమకు చిహ్నం హృదయం

అంశం: *చిత్ర కవిత* 


శీర్షిక : *ప్రేమకు చిహ్నం హృదయం*

అందమైన రోజు ఇది
ఆహ్లాదకరమైన వాతావరణం
అద్భుతమైన సుముహూర్తం
ఆనందకర డోలికలలో మనం

పంచభూతాల సాక్షిగా
మనమదిలలో కలిగిన ఆలోచనలకు
మన ప్రేమకు చిహ్నంగా
అర్పిస్తున్నాను నా హృదయం

నా హృదయం నీ స్వంతం
నీ హృదయం నా స్వంతం
నాకు నీవు తోడు నీడగా ఉండాలని
నీకు నేను తోడు నీడగా ఉండాలని
కలకాలం జీవితం హాయిగా సాగిపోవాలనీ
అష్ట దిక్పాలకులను వేసుకుందాం

కష్టాలను సుఖాలను బాధలను ఆనందాలను
కలిసి పంచుకుందాం కడదాకా
ఒకరంటే ఒకరికి ప్రేమతో  గౌరవంతో
రతీదేవి మన్మధుడిలా విహరిద్దాం

భార్యా భర్తల సుఖమయ జీవితానికి
ఖర్చు లేని పెట్టుబడి  *నమ్మకం*
క్షయం లేనిది *ఒకరినొకరు అర్ధం చేసుకోవడం*
ఉచితమైనది *దాపరికం* లేకుండా గడపడం
విలువైనది *సర్దుబాటు గుణం" కలిగి ఉండటం
 

No comments: