అంశం:మనో భావాలు
శీర్శిక: *పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి*
*పుర్రెకో బుద్ధి జిహ్వ కో రుచి*
అన్నారు పెద్దలు
ప్రతి మనిషి అభిప్రాయాలు ఆలోచనలు
అభిరుచులు వేరువేరుగా ఉంటాయి
మనిషి మనసు నుండి పుట్టిన
భావాలే మనోభావాలు
ప్రతి మనిషి పలు రకాల భావాలు
ఆలోచనలు కలిగి ఉంటారు
ఒక్కొక్కరు ఒక్కో మనోభావంతో
ఒక్కొక్కరు ఒక్కో మనస్థత్వంతో
వివిధ రకాల స్పందనలతో ఉంటారు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం
గ్రహాలు రాశుల ననుసరించి
కొందరి మనోభావాలు కలుస్తాయి
మరికొందరి మనో భావాలు కలువవు!
వివాహ బంధాలు చూసేటప్పుడు
యువతీ యువకుల మనోభావాలు
కలుస్తాయో లేదో తెలుసుకుంటారు
అప్పుడే వారు అన్యోన్యంగా జీవిస్తారని
అందరూ విశ్వసిస్తారు!
మనోభావాలు వారి వారి వ్యక్తిగత
అభిప్రాయాలు ఆలోచనలు
ఎవరితోనైనా మాట్లాడే టప్పుడు
వారి మనోభావాలు దెబ్బతినకుండా
వారి అహం దెబ్బతినకుండా మాట్లాడాలి!
కొందరి భావాలు కలువవు
కాలాలను బట్టి పరిస్థితులను బట్టి
భావాలు మారుతూ ఉంటాయి
మానవ సంబంధాలు బంధాలు
స్నేహాలు వ్యాపారాలు అన్నియు
మనుషుల భావాలపైననే ఆధారపడి
మార్పులు చోటు చేసుకుంటాయి
భావాలు ప్రేమతో కూడినవైతే
బంధాలు నిలబడుతాయి
ఆలోచనలు సదుద్దేశంతో ఉంటే
భాగస్వామ్యాలు చక్కగా కొనసాగుతాయి!
ప్రతి మనిషి పలు రకాల భావాలు
ఆలోచనలు కలిగి ఉంటారు
ఒక్కొక్కరు ఒక్కో మనోభావంతో
ఒక్కొక్కరు ఒక్కో మనస్థత్వంతో
వివిధ రకాల స్పందనలతో ఉంటారు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం
గ్రహాలు రాశుల ననుసరించి
కొందరి మనోభావాలు కలుస్తాయి
మరికొందరి మనో భావాలు కలువవు!
వివాహ బంధాలు చూసేటప్పుడు
యువతీ యువకుల మనోభావాలు
కలుస్తాయో లేదో తెలుసుకుంటారు
అప్పుడే వారు అన్యోన్యంగా జీవిస్తారని
అందరూ విశ్వసిస్తారు!
మనోభావాలు వారి వారి వ్యక్తిగత
అభిప్రాయాలు ఆలోచనలు
ఎవరితోనైనా మాట్లాడే టప్పుడు
వారి మనోభావాలు దెబ్బతినకుండా
వారి అహం దెబ్బతినకుండా మాట్లాడాలి!
కొందరి భావాలు కలువవు
కాలాలను బట్టి పరిస్థితులను బట్టి
భావాలు మారుతూ ఉంటాయి
మానవ సంబంధాలు బంధాలు
స్నేహాలు వ్యాపారాలు అన్నియు
మనుషుల భావాలపైననే ఆధారపడి
మార్పులు చోటు చేసుకుంటాయి
భావాలు ప్రేమతో కూడినవైతే
బంధాలు నిలబడుతాయి
ఆలోచనలు సదుద్దేశంతో ఉంటే
భాగస్వామ్యాలు చక్కగా కొనసాగుతాయి!
No comments:
Post a Comment