అంశం: ప్రజాస్వామ్యమా ఉన్నావా?
శీర్శిక: *ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పాలన*
*పైన పటారం లోన లొటారం* అన్నట్లుగా
పేరుకే ప్రజాస్వామ్యం లోన అంతా నేతల స్వామ్యమే!
ఆదర్శమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం గల దేశం
జనాభాలో రెండవ అతి పెద్ద దేశం
సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు అద్దం!
భిన్నత్వంలో ఏకత్వంలా
విభిన్న మతాలు అనేక కులాలు భాషలు
ఎన్నోరకాల సంస్కృతి సాంప్రదాయాలతో
కలిసి మెలసి అన్యోన్యంగా జీవించెదరు!
కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం
రోజు రోజుకు అపహాస్యం పాలవుతుంది
అప్రజాస్వామ్యం చాపకింద నీరులా
క్రమ క్రమేణా దేశమంతా విస్తరిస్తుంది!
ప్రజాస్వామ్య భారత దేశంలో
రాజ్యాంగ వ్యవస్థ ఉంది చట్టాలు ఉన్నాయి
రక్షక భటుల యంత్రాంగం ఉంది, కానీ
చట్టాలు ధనవంతుల చుట్టాలుగ మారాయి
రక్షక భటులు నేతలకు రక్షకులుగా మారారు
నేడు దుడ్టున్నోడిదే బర్రె అవుతున్నది!
లౌకిక రాజ్యం మనది
రాజ్యాంగంలో అందరూ సమానులే
అన్ని మతాలు కులాలు సమానమే
వాస్తవంలో మతాలనుబట్టి కులాలను బట్టి
వాస్తవంలో మతాలనుబట్టి కులాలను బట్టి
ఓటు బ్యాంకు రాజకీయాలతో
భూస్వాములైననూ భూకబ్జా దారులైననూ
భూస్వాములైననూ భూకబ్జా దారులైననూ
రైతు బంధు పధకాలు
ధనికులైనా సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు!
ప్రశ్నించే స్వేచ్ఛ ఓటు వేసే స్వేచ్ఛ లేదు
పనిచేసే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ లేదు!
అందుకే
ప్రశ్నించే స్వేచ్ఛ ఓటు వేసే స్వేచ్ఛ లేదు
పనిచేసే స్వేచ్ఛ జీవించే స్వేచ్ఛ లేదు!
అందుకే
ధనవంతులు మరింతగా ధనవంతులుగా
పేద వారు మరింత పేదలవుతున్నారు
పేద వారు మరింత పేదలవుతున్నారు
ఉచితాలను ఆశించకుండా
యువతలో ప్రశ్నించే శక్తి పెరుగుతే
ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం జరుగుతుంది
యువతలో ప్రశ్నించే శక్తి పెరుగుతే
ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం జరుగుతుంది
*ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పాలన*
*విధిస్తే*
దేశంలో అవినీతి అంతం అవుతుంది
No comments:
Post a Comment