Wednesday, June 18, 2025

వెన్నెల రాత్రులలో

అంశం: పదాల కవిత

(మల్లెల వాన, ఉదయాలు, వెన్నెల రాత్రులు, అక్షరాలు, ఎడబాటు, సప్త వర్ణాలు)

శీర్షిక: *వెన్నెల రాత్రులలో*

రాధా! ఏమీ నీ సిగ్గు శివుని సిగలో చంద్రికలా
జీవ కళ నింపుకున్న పుష్పం,
*ఉదయాలలో* ఎదుగుతున్న తరుణం
తళతళ మెరిసే సుగంధ పరిమళాల
*మల్లెల వాన*!

నా రాధా! తుమ్మెదలు వాలని స్వచ్ఛమైన
గుభాలించు కుసుమం
చిరు గాలి సోకని చిత్ర విచిత్రాల ఇంపైన
సంపెంగ సుమం నీవు
*ఉదయపు* సూర్య రస్మి సోకని ఎరుపెక్కిన
సుగంధాల మకరందాల మందారం!

నా రాధా! నీవు వర్షపు చుక్క తాకని
సుకుమార స్వేత గులాబీల పరిమళం
*వెన్నెల రాత్రులు* నాలో సంతోషాలు నింపుతావు
జగతిలో సరిగమలు పాడుతావు
నీ *అక్షరాలు* మదిలో ఆనందాలు నింపాయి
ఆహ్లాదాలు కురిపించాయి
మధురామృతాలు చిలుకాయి
నా గుండెలో మహాద్భుతాలు సృష్టించాయి!

రాధా! నీ ప్రేమ గలగల పారే జలపాతంలా
స్వచ్ఛమైన గంగా నదిలా
*వెన్నెల రాత్రులలో* ఆకాశంలో చిరుగాలిలో 
తేలిపోయే తెల్ల మబ్బుల్లా
నిండు పున్నమి జాబిలిలా గోచరిస్తున్నాయి!

శశి చూపులతో పరవసించి
విప్పారిని కొలనులోని కలువల్లా
విరిచిన నిండు గర్భిణి మల్లెల సుగంధాల మకరందాల్లా
ఆకాశంలో విరిసిన అద్భత *సప్త వర్ణాల*
ఇంద్రధనుస్సులా వెలిగి పోతున్నావు

మన *ఎడబాటు* జగతికి తీరని లోటే గా!
 

No comments: