Tuesday, June 3, 2025

విశ్వాసం - ఆత్మ విశ్వాసం

అంశం:ఆత్మ విశ్వాసం


శీర్శిక: *విశ్వాసం - ఆత్మవిశ్వాసం*

*కృషితో నాస్తి దుర్భిక్షం*
మనిషి తలుచుకుంటే
సాధించలేనిది ఏముంటుంది
పదివేల అడుగుల ప్రయాణానికైనా
మొదటి అడుగే ముఖ్యం

ఏదేని కార్యం సాధించాలన్నా
ఏదేని పోటీలో గెలవాలన్నా
పరీక్షలలో ఉత్తీర్ణత కావాలన్నా
ముందు ఆలోచన తపన విశ్వాసం ఉండాలి

విశ్వాసం వేరు ఆత్మవిశ్వాసం వేరు
ఒక వస్తువుపై ఒక పనిపై ఒక వ్యక్తిపై
నమ్మకం కలిగి ఉండటం విశ్వాసం
ఈ పని పూర్తి చేయగలను అని తనపై తనకు
నమ్మకం ఉండటం ఆత్మ విశ్వాసం

ఒకరి విశ్వాసం నమ్మకం ఎదుటి వారికి
వేయి ఏనుగుల బలాన్ని స్తుంది
సీతను హనుమ లంకలో వెతుకగలడు
అనే నమ్మకం రాముడికి ఉంది
హనుమంతుడు వెతకగలను అనే
ఆత్మ విశ్వాసంతో సముద్రాన్ని అవలీలగా
దాటి లంకలో సీత జాడను కనుగొన్నాడు
అది ఆత్మ విశ్వాసం అంటే

బ్రతక గలను విజయం సాధించగలను
అనే విశ్వాసం మనపై మనకు ఉంటే
తప్పకుండా జీవించ గలం సాధించ గలం
ఆత్మ విశ్వాసానికి పేద ధనిక ప్రాంత భాష
తారతమ్యం ఉండదు

భాష రాకపోయినా రష్యా అమెరికా
లండన్ లో హాయిగా జీవిస్తున్నారు
అదే ఆత్మ విశ్వాసం

ఆత్మ విశ్వాసానికి అహంకారానికి
వెంట్రుక వాసి తేడా మాత్రమే
అహంకారం దరి చేరకుండా ఆత్మవిశ్వాసంతో
జీవిస్తే స్వర్గం నీ కాళ్ళ చెంతే!
 

No comments: