Friday, June 27, 2025

రాజ్యాంగ రక్షణ P

శీర్షిక: రాజ్యాంగ రక్షణ

ఆదర్శమైన ప్రజాస్వామ్య దేశం
ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ దేశం
జనాభాలో రెండవ అతి పెద్ద దేశం
సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శం!

కానీ పేరుకే ప్రజాస్వామ్యం 
లోన అంతా అవినీతి నేతల భాగస్వామ్యం
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా 
దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే
ఉండటానికి గల కారణాలలో ఇదే ప్రథమం!

భిన్నత్వంలో ఏకత్వంలా
విభిన్న మతాలు అనేక కులాలు భాషలు
ఎన్నోరకాల సంస్కృతి సాంప్రదాయాలతో
కలిసి మెలసి అన్యోన్యంగా జీవిస్తాం!

నేడు భారత దేశంలో ప్రజాస్వామ్యం
రోజు రోజుకు అవుతుంది అపహాస్యం
చాపకింద నీరులా అప్రజాస్వామ్యం
క్రమ క్రమేణా దేశమంతా విస్త్రుతం!

లౌకిక రాజ్యమైన ప్రజాస్వామ్య దేశంలో
రాజ్యాంగ వ్యవస్థలు చట్టాలు కాగితాలలో
రక్షక భటుల యంత్రాంగం నియంత్రణలో
కానీ, యంత్రాంగాన్ని నడిపించే సమర్ధులు 
నీతి నిజాయితీ గలవారు కరువయ్యారు 
అవినీతి నేతలు బ్యూరోక్రాట్స్ ఏకమయ్యారు!

చట్టాలు ధనవంతుల చుట్టాలుగా
రక్షక భటులు నేతలకు రక్షకులుగా

రాజ్యాంగంలో అన్ని మతాలు కులాలు
పేద ధనిక అందరూ సమానమే 
అయినా వాస్తవంలో మతాలను కులాలను
ఓట్లను బట్టే సంక్షేమ పథకాలు అమలు!

ఓటు బ్యాంకు రాజకీయాలతో 
భూస్వాములైననూ భూకబ్జా దారులైనా
నేతలు వేతనాలు పెన్షన్లు పొందుతున్నా 
పన్నులలో  మినహాయింపులు 
భూస్వాములకు రైతు బంధు పధకాలు 
ధనికులైనా సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు!

పౌరుడికి ప్రశ్నించే స్వేచ్ఛ లేదు 
నిజాయితీగా ఓటు వేసే స్వేచ్ఛ లేదు
పనిచేసే స్వేచ్ఛ  జీవించే స్వేచ్ఛ లేదు
ఓటుకు నోటు పంచే వారిని 
రాష్ట్ర దేశ సంపదను దోచే వారిని
పలుకు బడి గల అవినీతి పరులను 
రాజ్యాంగ వ్యవస్థలు పట్టించు కోలేవు!

తప్పుడు అఫిడవిట్లు సమర్పించే వారిని
జైలు నుండి పోటీ చేసే నిందితులను 
పండు వృద్ధులను అనర్హుల చేసే
యంత్రాంగం దేశంలో లేదు 

అందుకే ధనవంతులు మరింత 
ధనవంతులుగా
పేదలు మరింత పేదలవుతున్నారు
బ్రతుకు దెరువు లేక కడుపు నింపుకోడానికి
భార్యా పిల్లల పోషించుకోడానికి 
గత్యంతరం లేక పూట గడవక
ఉచితాలపై ఆశ పడుతున్నారు 

పేదలకు సమానంగా కనీస అవసరాలైన
కూడు గూడు గుడ్డ విద్య వైద్యం
ఉచితంగా అందించుటకు
నజరాలను పధకాలను ఆశించకుండా 
యువతలో ప్రశ్నించే శక్తి పెరిగితేనే
ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం!

*ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రపతి పాలన*
*రాష్ట్రాలలో , దేశంలో విధిస్తే* 
నేతలలో వణుకు పుడుతుంది
రాజ్యాంగ రక్షణకు నడుం చుడుతారు
దేశంలో అవినీతి పాలన అంతమౌతుంది
కాదు కూడదంటే వేయి ఏండ్లైనా
అవినీతి రాజ్యమేలడం సత్యం!
 

No comments: