Saturday, June 14, 2025

సరి లేరు నీకెవ్వరూ/పేరడీ గేయాలు

 అంశం: పేరడి గేయాలు


శీర్షిక: *సరి లేరు నీ కెవ్వరూ*..
(సరి లేరు నీ కెవ్వరూ సరసాల సుధాకర - కంచుకోట సినిమా)

పల్లవి:
సరిలేరు నీకెవ్వరూ ... సాహాసాల నరేంద్రా ...
సరి రారు నీకెవ్వరూ ....... "సరి"

చరణం:01
రాజ నీతిలోనా , రాజుల మించి నావు
రణ భూమి యందు , మహా రాజుల మించి నావు  
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

చరణం:02
బ్రహ్మ చారివై  నీవు , భవ బంధాలు వీడినావు
ఆర్ ఎస్ ఎస్ లో చేరి  , సవ్యసాచి వైనావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

చరణం:03
చెదలు పట్టిన  చట్టాలను , చెత్తలో కలిపినావు  
తలాక్  చట్టాలను , తుడిచి పెట్టినావు
ఈ దేశ ప్రజలందరూ , ఓ నరేంద్రా......
జోహారు లను చుండిరి....   "సరి"

చరణం: 04
ఆపరేషన్ సింధూర్ లో., శరవేగంతో నీవు "2"
శత్రు దేశాన్ని నీవు, మట్టి కరిపించావు
చుక్క నీరియ్యకుండ, చుక్కలు చూపించావు
నారీమణులలో, ధైర్యాన్ని నింపావు
ఈ దేశ ప్రజలందరూ.. ఓ నరేంద్రా...
జోహారులను చుండిరీ...

No comments: