అంశం:మనోదర్శనం
శీర్శిక: మనస్సులోని భావాల చిత్రం
తన మనస్సును గానీ
ఇతరుల మనస్సులను గానీ చదువడమే
తెలుసు కోవడమే మనో దర్శనం!
పంచేంద్రియాలైన కన్నులు ముక్కు
చెవులు నాలుక చర్మాలైన
ఏదో ఒక దానితో గానీ లేదా అన్నింటితోగానీ
మెదడుకు సందేశాలు అందినప్పుడు
మనస్సులో చిత్రించే విషయం సంఘటన
దాని భావోద్వేగాలు గ్రహించడం మనో దర్శనం!
మనసు మెదడు తేలికగా అర్ధం కావాలంటే
*మొబైల్ మెదడైతే మనస్సు సాఫ్ట్వేర్*
*కరెంట్ తీగ మెదడైతే కరెంట్ మనస్సు*
మెదడు భౌతికం మనసు కనిపించని దృష్యం!
కన్నులతో ఒక యువకుడు ఒక యువతిని
చూసి నపుడు ఆ సంకేతం మెదడుకు చేరి
అతడి మనస్సులో ఆ యువతి అందం
ఆహార్యం ఎత్తు వయసు స్టైలు ఉద్యోగా
పెళ్ళి అయిందా లేదా ఇలాఎన్నో
ఆలోచనలు ఊహలు అతని మనస్సులో
అనుకూల ప్రతికూల భావాలతో
ఆనందాలు సంతోషాలతో చెక్కర్లు కొడుతాయి
మెమొరీలో ఒక దృశ్యాన్ని చిత్రిస్తాయి
ఆ దృశ్యం ఒక్కోసారి జీవిత కాలం
గుర్తుండి పోతుంది!
ఇలా చదివినవి చూసినవి విన్నవి
వాసన చూసినవి గాయాలు సంఘటనలు
అన్నియు మెదడులో రికార్డు అవుతాయి
ఇష్టమైనవి ఎక్కువ కాలం
ఇష్టం లేనివి తక్కువ కాలం మెమొరీలో
నిక్షిప్తమై తరువాత జ్ఞాపకం వస్తుంటాయి!
అలా చిత్రించినది తాను తెలుసు కోవడమే
మనో దర్శనం లేదా మనస్సును దర్శించడం
మనో దర్శనం అననుది తన మనస్సును
తాను తెలుసుకోవడం కావచ్చు
ఎదుటి వారి మనస్సులోని ఆలోచనలు
తెలుసుకోవడమూ కావచ్చు!
జరుగ బోయే వాటిని ముందే తెలుసుకునే
గొప్ప దివ్య దృష్టి అననుది కొందరికే సాధ్యం
మునులు ఋషులు బ్రహ్మంగారు వంటివారు
దివ్యదృష్టి శ్రేష్ఠులనీ చెప్పవచ్చు!
నేటి *కృత్రిమ మేధస్సు* ద్వారా
ఇతరుల మనస్సులోని ఆలోచనలను
తెలుసుకోవడం చాలా సులభతరమైనది!
*కృత్రిమ మేధస్సు* రెండు వైపులా
పదునైన కత్తి లాంటిది
కత్తితో పండుకోయవచ్చు ప్రాణం తీయవచ్చు!
తనకు సమాజ హితానికి ఉపయోగించడం
అత్యావశ్యకం!
No comments:
Post a Comment