Monday, June 2, 2025

నా తెలంగాణ వైభవం

శీర్షిక: *నా తెలంగాణ వైభవం*

కిల కిలా రావాలతో ఉషోదయాన పులకరించే నేల..
గల గలా పారే గోదావరి వయ్యారాలతో పొంగిపొర్లే నదీ నేల..
పాడి పంటలతో సస్యశ్యామల మైన నల్లరేగడి నేల.. 
తరువులు చెరువులు ఝరులతో ప్రకృతి పరవసించేటి నా తెలంగాణా..!

"పల్లెటూరి పిల్ల గాడా" తో పేురు గాంచిన సుద్ధాల హనుమంత్..
"భద్రం కొడుకో జరాభద్రం కొడుకో" అంటూ గద్దర్... 
"పల్లే కన్నీరు పెడుతోందో" పాటతో గోరేటి వెంకన్న వంటి ప్రజా కవులు...
యాసభాష పలుకుబడి భాష అంటూ నినదించిన కాళోజీ ...
పోతన దాశరథీ సినారే వంటి గొప్ప సాహిత్య కవులు..
సురవరం ప్రతాపరెడ్డి మరెందరో  తెలుగు భాషకు
పట్టం కట్టిన కవులకు..
జన్మనిచ్చిన పవిత్ర నేల నా తెలంగాణ!

చతుష్షష్టి కళలతో కనువిందు చేసే కళాకారుల సవ్వడి..
నటన నృత్యం పాటలు సంస్కృతి సాంప్రదాయాలు...
హరిదాసుల వారి హరి కీర్తఉనలు గంగిరెద్దుల వారి ఆటలు పాటలు...
పోతరాజుల విన్యాసాలు పోలేరమ్మ జాతరలు బతుకమ్మ పండుగలతో నా తెలంగాణా..

నల్ల రేగడి ఎర్రమట్టి మరెన్నో భిన్నమైన సాగు భూములు...
రంగు రంగుల గ్రానైట్ తో  ఉవిస్తరించిన మైనింగ్ గనులు..
నల్లబంగారం పండిస్తున్న సింగరేణి గనులు..
నిత్య నూతనంగా తేజరిల్లుతున్న గోల్కొండ రామప్ప లక్నవరం వేయిస్తంభాల గుడులు కట్టడాలు..!

తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ మరెందరో మహానుభావుల..
త్యాగమూర్తులు సబ్బండ జాతుల సమైక్య కృషితో అవతరించినది నా తెలంగాణ...!

*కోటి రతనాల వీణ నా తెలంగాణ* ఆనిన
దాశరధీ నినాదం...
నా తెలంగాణ వైభవానికి ఎంతో స్పూర్తి దాయకం...
                     -------

No comments: