Friday, June 13, 2025

తలంబ్రాలు పెళ్లిలో ఒక వేడుక

*నేటి అంశం*చిత్రకవిత*

(పెళ్ళి తలంబ్రాల వేడుకలు)

శీర్షిక: *తలంబ్రాలు పెళ్ళిలో ఒక వేడుక*

పెళ్ళంటే నూరేళ్ళ పంట
యువతీ యువకుల నూతన జంట
ఒకరినొకరు చూసుకుంటారు ఓరగంట
ఇక కలకాలం నివసిస్తారు ఒక ఇంట!

తలంబ్రాలు పెళ్ళిలో ఒక వేడుక
చూసుకుంటూ పోసుకోవాలని కోరిక
దొరుకుతుంది ఇప్పుడే వారికి తీరిక
పోస్తూ ఫోజులిస్తారు ఫోటోలకు వారిక!

ఒకరినొకరు ప్రేమగా చూసుకోవాలని
*సిగ్గు బిడియం లేకుండా కలిసిపోవాలని*
తీపి గుర్తులు రేపటికి దాచి పెట్టుకోవాలని
తలంబ్రాలు ఆనందాలకు చిహ్నమని!

నేటి వివాహాల తీరుమారుతుంది
పెళ్ళికి ముందే మాటముచ్చటైపోతుంది
వెడ్డింగ్ కు ముందే ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది
పెళ్ళి వేడుకలంటేనే బోరుగొడుతుంది!

పెళ్ళైన ఏడాదికే విడాకులు 
ఒకరిపైన మరొకరు కోర్టులో కేసులు 
అధిక మొత్తంలో భరణాలకు నోటీసులు 
చెల్లించలేక ఆందోళనలు ఆత్మహత్యలు!


No comments: