అంశం: నీతి బోధ
శీర్శిక: వ్యక్తిత్వంతో జీవించ వలెను
బుద్దుడిలా ధర్మాన్ని పాటించాలి
హరిశ్చంద్రుడిలా సత్యమును పలుక వలెను
గాంధీ వలె అహింసా మార్గంలో నడువవలె
రాముడి వలే న్యాయ పాలన చేయవలె!
కృష్ణుడి వలె ప్రేమ తత్వం కలిగి ఉండవలెను
వ్యాసుడి వలె జ్ఞానాన్ని సముపార్జించ వలెను
రామలక్ష్మణుల వలె అన్నదమ్ములు ప్రేమతో
కలిసి ఉండాలి
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలెను!
గురువులను పెద్దలను గౌరవించ వలెను
తల్లిదండ్రులను సేవించవలెను
దైవాన్ని పూజించ వలెను
సమాజానికి సహాకారం అందించవలెను!
మూగ జీవాలను ప్రేమించ వలెను
చెరువులను కాపాడవలెను
తరువులను పెంచ వలెను
దేశ సంపదను కాపాడవలెను
పంచ భూతాలను కాలుష్యం చేయరాదు!
క్రమ శిక్షణ పాటించాలి
విలువలతో బ్రతుక వలెను
అరిషడ్వర్గాలను వదిలి వేయవలెను
వ్యక్తిత్వంతో ఆనందంగా జీవించ వలెను!
No comments:
Post a Comment