*నేటి అంశం: *సామెతలు*
*1 *ఆరోగ్యమే మహాభాగ్యము***2 ఆలస్యం అమృతం విషం*
శీర్షిక: *ఆరోగ్యమే మహాభాగ్యం*
లక్షల కోట్లు లక్ష్మి కటాక్షాలు సంపదలు భాగ్యాలు ఎన్ని ఉన్ననూ..
భూములు ఆకాశ హార్మ్యాలు ఆకాశ శకటాలు ఎన్ని ఉన్ననూ..
వాటిని అనుభవించడానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలి కదా...
అందుకే అంటారు పెద్దలు *ఆరోగ్యమే మహాభాగ్యం* అని...
మనిషికి ఆరోగ్యం లేకుండా ఎంత భాగ్యం ఉండి ఏమి ప్రయోజనం?...
బిపి షుగర్ వంటి వ్యాధులు రాకుండా ఐదు తెలుపు పదార్థాలను...
పంచదార పాలు అన్నం ఉప్పు ఇడ్లి దోస కు...
దూరంగా ఉండాలి చిరు ధాన్యాలు తినాలి నడవాలి వ్యాయామం చేయాలి...
ప్లాస్టిక్ కవర్లలోని పదార్థాలను తిన్నను, ప్లాస్టిక్ టీ కప్పులో టీ త్రాగినా...
కొందరికి వెంటనే శరీరంపై దురదలు వస్తాయి గమనించాలి...
కూల్ డ్రింక్స్ త్రాగడం వలన జంకు ఫుడ్స్ తినడం వలన...
మద్యపానం ధూమపానం సేవించడం వలన గుట్కాలు తినడం వలన...
నాన్ వెజ్ తినడం వలన ఆరోగ్యం చెడుతుందని గ్రహించాలి..
*ఆలస్యం అమృతం విషం* ఆలస్యం చేయడం వలన...
ఒక్కోసారి మేలు జరుగవచ్చు కానీ ఎక్కువ సార్లు
నష్టమే జరుగుతుంది...
అందుకని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి.
No comments:
Post a Comment