*అంశం*పదాల కవిత*
పదాలు:*మువ్వలు*
*గవ్వలు*
*నవ్వులు*
*పువ్వులు*
శీర్షిక: * ముసిముసి నవ్వులు*
శిశువు దశలో అమ్మను చూడగానే
విరబూసిన మల్లె *పువ్వులు* లా
కిలకిలా నవ్వుతుంది పాప
పాలు పట్టగానే నిండు గులాబీలా
పెదవుల చివరల నుండి
పాలు కార్చుతూ *నవ్వుల* జల్లులు
కురిపిస్తుంది!
అమ్మ జోల పాట పాడి నప్పుడు
నాన్న వ్రేలు పట్టుకుని నడిచినప్పుడు
ఘల్లు ఘల్లు మంటూ కాళ్ళ *మువ్వలు*
ఇంటిల్లిపాదిని పరవసింప జేస్తాయి!
అమ్మా నాన్నా *గవ్వల* తో ఆట
ఆడుతూ ఓడుతూ గెలుస్తుంటే
కిల కిలా నవ్వుతూ కేరింతలు కొడుతూ
చుట్టూ తిరుగాడుతుంటే ఆ సంతోషం
చెప్ప నలవి కాదు చూసి తరించాలి తప్ప!
కొత్త గౌను వేసి తలలో పూలనుచుట్టగ
కాళ్ళ గజ్జెలతో ఇల్లంతా అడుగులు వేస్తూ
ముసి ముసి నవ్వులు విసురుతుంటే
అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు
ఆ చిట్టి తల్లి తల నిమురుతూ
ఆనందిస్తుంటే ఆ గృహంలో లక్ష్మి
తాండవించకుండా పారిపోతుందా!
No comments:
Post a Comment