శీర్షిక: చెలీ..ఓ నెచ్చెలీ..
ప్రక్రియ:గేయాలుచెలీ ..ఓ..నెచ్చెలీ..
కలలోనూ నీ రూపమే..
ఇలలోనూ నీ తాపమే..
ఎటు చూసిన నీ ద్యాసనే..
నా కలల ఆశవు నీవేగా...
ఆకాశంలో వయ్యారంగా విహరిస్తావు..
విరహ బాధ తాళలేక నేనున్నాను...
నింగి లోన నీవు నేల పైన నేనూ..
కలువ లేక నేనున్నా కనికరం నీవు ఉంటూ...
తళతళ మెరుస్తూ సప్త వర్ణాల ఇంద్ర ధనుస్సు వలే..
ఆశలెన్నో రేకెత్తిస్తుంటావు...
కనుమరుగై పోతుంటావు..
కనులార చూసినా తనివి తీరకుండే...
కమ్మని ఊసులెన్నో చెప్పాలని ఉందీ..
నీ ఎదలపై కడదాకా ఒదిగి పోవాలని ఉందీ...
నీ పెదవులపై అమృతాన్ని జుర్రాలని ఉందీ...
నా గుండెలోని హృదయాన్ని పంచాలని ఉందీ?..
నీ కోసమే నేనున్నా....
నా కోసమే నీ వనుకున్నా...
కదిలిరా నా చెలీ... ఇంకను జాగు ఏలరా...
నేల పైకి కదలిరా నా నెచ్చెలీ..
తారా జువ్వలా కదలిరా ఆశాజ్యోతీలా...
నా గుండెలోని హృదయాన్ని పంచాలని ఉందీ?..
నీ కోసమే నేనున్నా....
నా కోసమే నీ వనుకున్నా...
కదిలిరా నా చెలీ... ఇంకను జాగు ఏలరా...
నేల పైకి కదలిరా నా నెచ్చెలీ..
తారా జువ్వలా కదలిరా ఆశాజ్యోతీలా...
No comments:
Post a Comment