అంశం: ఏరువాక గీతాలు
శీర్షిక: *నల్లనల్లని మబ్బులతో నైఋతి వర్షాలు*
పల్లవి:
నల్ల నల్లని మబ్బులతో నైఋతి వర్షాలు
అందివచ్చే కాలం వారం ముందురోజులు
పులకరించి పోయే పుడమి పండువెన్నెలవోలే
పరవసించిరి రైతన్నలు పగలు రేయి అనక "నల్ల"
చరణం:01
జేష్ట పౌర్ణమిరోజు చిత్తముతో రైతులును
వృషభములన్నింటి వృక్షములను
హలముల పూజించి ఆనంద మొందేను
ఏరువాక వర్షాలు యేర్లు పారు. "నల్ల"
చరణం:02
చిన్నచిన్నగ నిల చిరుజల్లులుకురువగా
నెఱ్రెలు బాసిన నేల నిండగా
ఆరుద్ర పురుగులు యవనిలో తిరుగగా
తరువు కొమ్మల నీరు ధరణి చేరె. "నల్ల"
చరణం:03
తొలకరి సంబరం తొలుతరైతులకేను
వివిదరకములైన విత్తనములను
నాగలి పనిముట్ల నచ్చిన విధముగను
సరిచేసి సమకూర్చి సాగి పోయేను. "నల్ల"
చరణం;04
దారు లన్నియు బురుదలో దాగి పోయె
దుక్కి దున్ని రైతన్నచదునగ జేసి
పొలములోమడి కట్టియు పోసె నారు
తొలకరి వసంత మెల్లయు తోడు నిలిచె. "నల్ల"
No comments:
Post a Comment