*అంశం*బడి-హడావుడి*
శీర్షిక: *ప్రభుత్వ బడి అంటే మాకిష్టం*
గణ గణ *బడి* గంటలు మ్రోగినవి
పిల్లలలో *హడావుడి* మొదలైంది
తల్లిదండ్రుల కడుపులో ధడ పుట్టింది
రెక్కాడితే డొక్కాడని బ్రతుకులాయే!
అవి ప్రభుత్వ బడులు
అవియే విద్యార్థులకు గుడులు
మునుపటి వలె లేవు నేడు సర్కారు బడులు
రంగులతో సుందర మనోహరం బడి గోడలు!
ఉచితంగా పుస్తకాలు నోటుబుక్కులు
పలకలు పెన్నులు పెన్సిల్లు బలపాలు
ఉచితంగా రెండు యూనిఫాములు
ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు!
విశాలమైన స్థలంలో ఆటలు పాటలు
అందంగా తీర్చి దిద్దిన తరగతి గదులు
కూర్చోడానికి సుందరమైన కుర్చీ బల్లలు
చక్కగా బోధించే బోధన నేర్చిన గురువులు!
విద్యార్థులకు రవాణా ఖర్చులు లేవు
బడులకు రయ్యున పోయి రావచ్చు
విద్యార్థినులకు చక్కని వసతులు
పాఠశాల విద్యార్ధులకు ఒక పార్లమెంటు!
ప్రభుత్వ బడి అంటే మాకిష్టం
ఉచితంగా అన్ని పొందవచ్చు
ఆనందంగా విద్యను నేర్వవచ్చు
సందేహాల నివృత్తి చేసుకోవచ్చు
హాయిగా ఆటలు ఆడుకోవచ్చు !
No comments:
Post a Comment