Wednesday, June 25, 2025

సామెతలు అనుభవ పాఠాలు

*సామెతల కవిత*
*1చక్కనమ్మ చిక్కినా అందమే* 
*2బూడిద లో పోసిన పన్నీరు*

శీర్షిక: సామెతలు అనుభవ పాఠాలు 

నిశి రాత్రి ఆకాశంలో పున్నమి చంద్రుడు 
మబ్బులు అడ్డు వచ్చినా అందంగానే కనపడినట్లు 
అందమైన ఆమని ఒత్తుగా బొద్దుగా ఉండి 
అనారోగ్యం కారణంగానో శ్రమ రందులవలనో
వయసు మీద పడుతుండటం వలననో 
సన్న బడినా  *చక్కనమ్మ చిక్కినా అందమే*  ఉంటుంది! 

తెలుపు మేను ముఖ వర్చస్సు బాహ్య అందం 

కన్నులు ముక్కు కురులు శరీర సౌష్టవం

ఆహార్యం అనేవి తాత్కాలికం అశాశ్వతం! 

మంచి మనసు దయ కరుణ అంతర్గత అందం 
మంచి మాటలు నడవడిక వ్యక్తిత్వం శాశ్వతం 
అవి వెలకట్టలేనివి చక్కని గుర్తింపు 
కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతవి! 


అబ్దుల్ కలామ్ గారు అంటారు ఎప్పుడూ 
*కలలు కనాలి సాకారం చేసుకోవాలి* అని 
కలలు కనడం  ఊహల్లో తేలిపోవడం సులభం 
కానీ సాకారం చేసుకోవాలంటే 
సంకల్పం పట్టదల నిరంతర సాధన చేయాలి!

లేదంటే  అప్పటి వరకు పడిన శ్రమ అంతా 
*బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది*
మధ్యలో నిరుత్సాహంతో పనిని ఆపేసినట్లైతే
ఇప్పటివరకు పడిన శ్రమంతయు నిష్ఫలం 
అవుతుందనేది దీని భావం 
ఒక వేళ ప్రాజెక్టు పనులు నిర్మాణాలు అవుతే 
ఖర్చులు పెరిగి అప్పుల పాలవడం సహజం!

No comments: