Saturday, June 7, 2025

ఏరువాక / సీసా మాళిక

అంశం: ఏరువాక


ప్రక్రియ:  సీస మాలిక

సీ:
జేష్ట పౌర్ణమిరోజు చిత్తముతో రైతు
వృషభములన్నింటి వృక్షములను
హలముల పూజించి ఆనంద మొందేను
ఏరువాక  వర్షాలు యేర్లు పారు
చిన్నచిన్నగ నిల చిరుజల్లు లుకురువ
నెఱ్రెలు బాసిన నేల నిండె
ఆరుద్ర పురుగులు యవనిలో తిరుగగా
తరువు కొమ్మలనీరు ధరణి చేరె
తొలకరి సంబరం తొలుతరైతులకేను
వివిదరకములైన  విత్తనముల
నాగలి పనిముట్ల నచ్చిన విధముగా
సరిచేసి సమకూర్చి  సాగి పోయె!

తేగీ:
దారు లన్నియు బురుదలో  దాగి పోయె
దుక్కి దున్ని రైతన్నచదునగ చేసి
పొలములోమడి కట్టియు పోసె నారు
తొలక రివసంత మెల్లయు తోడు నిలిచె!

No comments: